వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును అధిష్ఠానం ప్రకటించింది. కడియం కావ్యతోపాటు అధిష్టానం మరో ఎంపీ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ ఖరారు చేసింది. మహారాష్ట్రంలోని అకోలా అభ్యర్థిగా డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్ పేరును ప్రకటించింది.

కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కావ్యను వరంగల్ BRS ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కావ్య అనూహ్యంగా టికెట్ వద్దనుకుని, బిఆర్ఎస్ కు రాజీనామా చేసి..తన తండ్రి కడియం శ్రీహరి తో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.