భారత్ కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం
విమానాశ్రయాల్లో, విమానాల్లో మాస్కులు తప్పనిసరి

భారత్ కు అంతర్జాతీయ విమాన సర్వీసులు రాకపోకలు ఆదివారం నుంచి మొదలయ్యాయి. కరోనా సంక్షోభం తో భారత్ లో రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆంక్షలు ఎత్తివేస్తూ కేంద్రం చేసిన ప్రకటనతో ప్రయాణికులకు ఊరట కల్గించినట్టు అయింది.
విమాన సిబ్బంది ఇకపై పీపీఈ కిట్లు ధరించనక్కర్లేదని, అయితే విమానాశ్రయాల్లో, విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన తన మార్గదర్శకాల్లో వివరించింది. విమానాల్లోనూ, ఎయిర్ పోర్టుల్లోనూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మూడు సీట్లను ఎమర్జెన్సీ అవసరాల కోసం ఖాళీగా ఉంచాలన్న నిబంధనను కేంద్రం విధించింది.
తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/