టాలీవుడ్లో విషాదం.. డబ్బింగ్ డైలాగ్ రైటర్ కన్నుమూత

టాలీవుడ్ డబ్బింగ్ డైలాగ్ రైటర్ శ్రీ రామకృష్ణ(74) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తేనాపేటలోని అపోలో హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. శ్రీరామకృష్ణ స్వస్థలం తెనాలి కాగా 50 ఏళ్ల కిందట చెన్నైలో స్థిరపడ్డారు. తమిళ్ సినిమాలకు, తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ అయిన చాలా సినిమాలకు శ్రీ రామకృష్ణ మాటల రచయితగా వ్యవహరించారు.

బాంబే, జెంటిల్మన్,‌ అపరిచితుడు, ఒకేఒక్కడు, చంద్రముఖి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలన్నిటికీ తెలుగులో డబ్బింగ్ కి డైలాగ్స్ ఈయనే రాశారు. దాదాపు 300 పైగా సినిమాలకు శ్రీ రామకృష్ణ పనిచేసారు. చివరగా రజినీకాంత్ దర్బార్ సినిమాకు తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ రాసారు. కొంతకాలంగా శ్రీ రామకృష్ణ వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నిన్న ఏప్రిల్ 1 రాత్రి మరణించారు. ఈయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు.