కానిస్టేబుల్‌ను చంపిన యువకులు

Young man rash driving
Young man rash driving

వనపర్తి: విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్‌ను కొందరు యువకులు కారుతో ఢీ కొట్టి పరారయ్యారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆయన ఈ రోజు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వనపర్తి జిల్లా మర్రికుంటలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడి పేరు సలీం ఖాన్‌ (57) అని, ఆయన శ్రీరంగాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని వివరించారు. నిన్న రాత్రి పలువురు పోలీసులతో కలిసి ఆయన మర్రికుంటలో వాహనాల తనిఖీ విధుల్లో ఉన్న సమయంలో ఓ కారును ఆపుతుండగా, ఆ కారులోని గుర్తు తెలియని యువకులు కారు వేగం పెంచి ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/