బిపిన్ రావత్ మృతి పట్ల దలైలామా సంతాపం

న్యూఢిల్లీ : ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన దుర్ఘ‌ట‌న‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మృతికి బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దేశ రక్షణ కోసం సుదీర్ఘ కలం పాటు జనరల్ రావ‌త్ అందించిన సేవలకు సెల్యూట్. ఆయన మృతి దురదృష్టకరం. రావ‌త్ కుటుంబ‌స‌భ్యులతో పాటు ఆ ప్ర‌మాదంలో చ‌నిపోయిన ఇతర సైనికుల కుటుంబాలకు కూడా సంతాపం తెలియజేస్తున్నాను’ అన్నిదలైలామా తెలిపారు .

కాగా , జనరల్ బిపిన్‌ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌ సహా 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తమిళనాడులోని సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి వెల్లింగ్టన్‌ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ఎంఐ 17 వీ5 హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/