రికార్డు ధరకు ‘ఆదిపురుష్‌’ తెలుగు థియేట్రికల్ రైట్స్‌

ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఆదిపురుష్. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ జూన్ 16 న భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. తాజాగా ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ రైట్స్‌ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా రూ.170 కోట్లు పెట్టి దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

తెలుగులో ఇప్పటి వరకు ఇదే అత్యధికమని సమాచారం. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి.