విశ్వక్ సేన్ VS11 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

వరుస సినిమాలతో యూత్ ను ఆకట్టుకుంటూ వస్తున్న విశ్వక్ సేన్..తాజాగా తన 11 వ సినిమా తో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తుంది. ‘రౌడీ ఫెలో’ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా ఆదివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ లో సిగార్ తాగుతూ రగ్డ్ లుక్‌లో విశ్వక్ కనిపించాడు. పోస్టర్ చూస్తుంటే.. పక్కా మాస్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇక ఇలాంటి క్యారెక్టర్లు టైలర్ మేడ్ అని తెలిసిందే. అయితే పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో గోడపై ఎన్టీఆర్ బొమ్మతో పాటు పక్కనే.. ‘జోహార్ ఎన్టీఆర్.. తెలుగోడి ఆత్మగౌరవం’ అనే కొటేషన్ ఆకట్టుకుంది.