మాస్క్‌లను తయారు చేసిన భారత ప్రథమ మహిళ
ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డుకు మాస్క్ ల అందజేత

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు తనవంతుగా భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
భార్య సవితా కోవింద్ రాష్ట్రపతి భవన్ లోని శక్తి హాత్ లో ఆమె స్వయంగా కుట్టుమిషన్ ఎక్కి మాస్క్ లను రూపొందించారు. న్యూఢిల్లీలోని షెల్టర్ హోమ్స్ లో ఉన్న నిరాశ్రయులకు మాస్క్ లను తయారు చేసి అందించారు. ఆపై వాటిని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డుకు పంపించారు. తన చర్యల ద్వారా కరోనా పోరుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలన్న సందేశాన్ని ఆమె సమాజానికి ఇచ్చారు. కాగా దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వస్త్రంతో తయారు చేసని మాస్కులు, మూడు పొరలు ఉండే సర్జికల్ మాస్కులు, ఎన్ 95 మాస్కులను లభ్యతను బట్టి ప్రజలు ధరిస్తున్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/