తూ.గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన 6 గురు మృతి..

నిత్యం రోడ్డు ప్రమాదాలు అమాయకపు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవర్ స్పీడ్ , నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీని ఢీ కొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, రెండేళ్ల వయసు చిన్నారి కూడా ఉన్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.