పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రకు పోలిసుల నుండి అనుమతి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..మరోసారి వారాహి వాహనం తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఈ నెల 14 నుండి కత్తిపూడి , పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం నియోజకవర్గం , పి.గన్నవరం , రాజోలు నియోజకవర్గాల్లో రోడ్ షో లు , బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను పార్టీ విడుదల చేసింది. రెండు రోజుల నుండి పవన్ పర్యటన కు పోలీసులు అనుమతి ఇస్తారో లేదో అని అంత ఖంగారు పడ్డారు కానీ చివరకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో జనసేన శ్రేణులు , అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ముందుగా వారాహి వాహనానికి అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజాకార్యక్రమాలు చేయనున్నారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి నుంచి భారీ సభ అనంతరం వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. కాకినాడ జిల్లా నుంచి ముమ్మిడివరం నియోజకవర్గం ద్వారా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోకి వారాహి యాత్ర ప్రవేశిస్తుంది. ఈనెల 14న ప్రారంభమయ్యే యాత్రలో రోడ్‌షో, కత్తిపూడి జంక్షన్‌ వద్ద బహిరంగ సభ, 16న పిఠాపురంలో రోడ్‌షో, సాయంత్రం బహిరంగ సభ,ఆ తరువాత 18న కాకినాడలో రోడ్‌షో, సాయంత్రం బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక ముమ్మిడివరం నియోజకవర్గం ద్వారా అమలాపురం చేరుకుని 20న రోడ్‌షో, బహిరంగ సభ జరగనుండగా 22న పి.గన్నవరం నియోజకవర్గం నుంచి రాజోలు నియోజకవర్గం చేరుకుని అక్కడ రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించేందుకు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు.