నేటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు

ఇంకా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు ఉంటాయని, ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు స్కూళ్లు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. కానీ అధిక ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత వల్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలు ఈనెల 17 వరకు ఉదయం పూట మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌.

జూన్ 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం బడులు పూర్తిస్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన పాఠశాలలపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉ.8.30 నుంచి ఉ.9.00 గంటల మధ్యలో రాగి జావ ఇవ్వాలని, మధ్యాహ్న భోజనం ఉ.11 30 నుంచి ఉ.12.00 గంటల మధ్యలో విద్యార్థులకు అందచేయాలని సూచనలు చేసింది.