వామ్మో..ఆఫ్రికా లో కొత్త రకం వైరస్..ఇప్పటివరకు 100 మంది చనిపోయారు

రోజుకో కొత్త రకం వైరస్ లు పుట్టుకొచ్చి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. గత రెండు ఏళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. రకరకాల రూపాల్లో వెలుగులోకి వస్తూ హడలెత్తిస్తోంది. ఈ మధ్యనే సౌత్ ఆఫ్రికా లో ఓమిక్రాన్ అనే వైరస్ వెలుగులోకి వచ్చి..ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తన పంజా చూపిస్తుంది. ఇదిలా ఉండగానే ఆఫ్రికా లో మరో వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు ఈ వైరస్ తాటికి 100 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తుంది.

ఆఫ్రికాలోని సౌత్ సూడాన్ అనే దేశంలో ఈ కొత్త వైర‌స్ వీర విహారం చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైర‌స్ తో సౌత్ సూడాన్ లో దాదాపు 100 పైగా ప్ర‌జ‌లు చ‌నిపోయారని ఆ దేశ మంత్రి కుగ్వాంగ్ ప్ర‌కటించారు. సూడాన్ లోని జోంగ్లీ అనే రాష్ట్రంలో ఇటీవ‌ల భారీ వ‌ర్షాలు కురిశాయి. దీంతో తాగునీటి స‌మ‌స్య‌, ఆహార స‌మ‌స్య తో అక్కడి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు తాగే నీరు మొత్తం కూడా క‌లుషితం అయింది. దీంతో వైర‌స్ వ్యాప్తి మరింత ఉదృతం అయినట్లు తెలుస్తుంది.