అభిషేక్ కు కరోనా నెగెటివ్

అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్

అభిషేక్ కు కరోనా నెగెటివ్
Abhishek-Bachchan

ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవలే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని అభిషేక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మాటంటే మాటే! ఈ మధ్యాహ్నం నాకు కరోనా టెస్టు చేయగా నెగెటివ్ అని వచ్చింది. ఈ వైరస్ ను జయిస్తానని మీకు ముందే చెప్పాను. నాకోసం, నా కుటుంబం క్షేమం కోసం ప్రార్థనలు చేసినవారందరికీ కృతజ్ఞతలు. నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించిన డాక్టర్లకు, నర్సులకు, వైద్య సిబ్బంది అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. థాంక్యూ!’ అంటూ అభిషేక్ తన స్పందన వెలిబుచ్చారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/