ఆధార్‌, వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ చూపిస్తేనే మద్యం – తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు

తమిళనాడు ప్రభుత్వం మందు బాబులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. మద్యం కావాలంటే నిమిషం పాటు లైన్లో నిల్చుని మద్యం తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఆలా కాదు ఆధార్‌, వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ చూపిస్తేనే మద్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ప్రస్తుతానికి నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు, కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్‌ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారులు.

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా.. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు, కరోనా టీకా పత్రం చూపాలని అధికారులు స్పష్టం చేశారు. దీని వల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు తీసుకుంటారని భావిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇన్నోసెంట్ దివ్య చెప్పారు. కాగా, ఇప్పటికే జిల్లా జనాభాలో దాదాపు 97% మందికి వ్యాక్సిన్ డోస్ ఇవ్వడం జరిగిందన ఆమె తెలిపింది. ప్రస్తుతానికి నీలగిరి జిల్లాకే పరిమితమైన ఈ రూల్‌ను క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో స్టాలిన్‌ సర్కార్‌ ఉంది. .