యూట్యూబ్ లో రికార్డ్స్ నెలకొల్పిన ఆచార్య ట్రైలర్..

యావత్ మెగా అభిమానులు , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్న మెగా ట్రైలర్ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగా స్టార్ చిరంజీవి కలయికలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కీలక రోల్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య. ఈ సినిమాకు రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూ ‘సిద్ధ’ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో అలరించనున్న విషయం తెలిసిందే. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి ఆసక్తి నింపారు. ఈ ట్రైలర్ తో సినిమా ఫై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ మొత్తం కూడా యాక్షన్ తో నింపేయడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ట్రైల‌ర్ విడుద‌ల అయిన 24 గంట‌ల్లో 24 మిలియ‌న్ల వ్యూస్ ను ఆచార్య సొంతం చేసుకుంది. అలాగే ఈ ట్రైల‌ర్ యూట్యూబ్ ట్రెండింగ్ టాప్ 1 ప్లేస్ లో ఉంది. అంతే కాదు లైక్స్ ప‌రంగా 1 మిలియ‌న్ లైక్స్ ను ఈ ట్రైల‌ర్ సొంతం చేసుకొని వార్తల్లో నిలిచింది.