పవన్ వల్ల ‘దర్శనం మొగులయ్య’ పేరు మారుమోగిపోతుంది

కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ తాలూకా టైటిల్ సాంగ్ ను నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భాంగా విడుదల చేసారు. ఈ పాటలో ఏడు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ మొగులయ్య కనిపిస్తాడు.

ఇంతకీ ఈ మొగులయ్య ఎవరంటే..నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట మొగులయ్య ష్వగరం. తండ్రి ఎల్లయ్య నుంచి వారసత్వంగా వచ్చిన ఏడు మెట్ల కిన్నెరను పన్నెండు మెట్లుగా మార్చి ప్రదర్శనలిచ్చేవారాయన. అంతరించిపోతున్న కిన్నెర వాద్య కళను కాపాడుతున్న మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి… ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించింది.

కరోనా పరిస్థితుల్లో ఊరూరా ప్రదర్శనలివ్వలేక మొగులయ్య కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈయన కష్టాలు వార్తల్లో ప్రచారం కావడం తో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు నెలకు రూ. 10 వేల ఫించన్ ఇస్తోంది. మొగులయ్య గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన్ని చెన్నై పంపించి తన సినిమా కోసం ప్రత్యేకంగా పాట పాడించారు. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్ లో సంచలన వ్యూస్ రాబడుతుంది. ఈ సందర్భాంగా మొగులయ్య సంతోషం వ్యక్తం చేస్తూ తనకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ , థమన్ లకు అలాగే నిర్మాతలకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపారు.

YouTube video