‘ఆత్మనిర్భర్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ ప్రారంభం

YouTube video
PM Modi launches Atma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan via Video Conferencing

న్యూఢిల్లీ: ప్రధాని మోడి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆత్మ నిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మోడి మాట్లాడుతూ..ఇప్పటి వరకు కరోనా వైరస్‌‌కు వాక్సిన్ రాలేదు. వ్యాధి బారినపడకుండా ఉండాలంటే అందరూ రెండడుగుల దూరాన్ని పాటించాలి. మాస్క్‌లు ధరించాలని మరోసారి దేశ ప్రజలకు మోడి సూచించారు. కరోనా నుంచి బయటపడాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా స్థానికంగా దాదాపు 1. 25 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రధానితో మాట్లాడాలనుకునేవారు కృషి విజ్ఞాన్‌ కేంద్రాలను సందర్శించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అధికారులు, వలస కార్మికులు పాల్గొన్నారు. కాగా దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లో ఆత్మ నిర్భర్ రోజ్‌గార్ యోజన పథకాన్ని అమలు చేయనున్నారు. వలస కార్మికులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. వలస కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. బీహార్‌లో అత్యధికంగా 32 జిల్లాల్లో గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన పథకం వర్తిస్తుంది. ఇక యూపీలో 31, మధ్యప్రదేశ్‌లో 24, రాజస్థాన్‌లో 22 జిల్లాలు ఉన్నాయి. పథకం ప్రారంభమైనందున అక్కడి వలస కార్మికులకు పని కల్పించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/