కరోనా టీకా ప్రయత్నాలు ముమ్మరం

దేశంలో టీకా ప్రయత్నాలు చేస్తున్న ఆరు సంస్థలు

vaccine testing
vaccine testing

దిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు మందును కనిపెట్టే పనిలో చాలా దేశాలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే చైనా తయారు చేసిన మందు రెండో క్లినికల్‌ టెస్ట్‌కు సిద్దమయింది. ఇందులో భారత్‌ నుంచి కూడా పలు పరిశోధన సంస్థలు పోటిపడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు మొదటి దశ క్లినికల్‌ టెస్టులను ప్రారంభించాయి. దేశం నుంచి కరోనాకు టీకా ను కనిపెట్టేందుకు ఆరు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో క్యాడిలా హెల్త్‌ కేర్‌, సీరం ఇనిస్టిట్యూట్‌, మిన్‌ వ్యాక్స్‌, బయోలాజికల్‌ ఇ, భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యునాలజికల్‌ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయని ఫరీధాబాద్‌లోని అంటువ్యాది సంసిద్దత ఆవిష్కరణల కూటమి వైస్‌ చైర్మెన్‌ గగన్‌ దీప్‌ కాంగ్‌ వెల్లడించారు. కరోనా టీకా మాత్రం 2021 తర్వాతే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/