మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 29న తిరుపతిలో భారీ ర్యాలీ

ఏపీలో ఓ పక్క అమరావతినే రాజధానిగా తేల్చాలని అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే..మరోపక్క మూడు రాజధానులకు మద్దతుగా వైస్సార్సీపీ తో పాటు JAC ర్యాలీ లు , ఆందోళనలు , గర్జన లు నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా విశాఖలో విశాఖ గర్జన పేరుతో భారీ కార్య క్రమం నిర్వహించగా..ఇక ఇప్పుడు తిరుపతి లో ఈ నెల 29 న భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు.

ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ మేధావులు, ప్రొఫెసర్లు ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేయగా, రాయలసీమ ఏళ్లుగా మోసపోతోందని, అన్యాయానికి గురవుతోందని మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో విభజన వాదం తలెత్తకుండా సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

ఈ సభతో రాయలసీమలో మూడు రాజధానుల శంఖారావం పూరించాలని వైస్సార్సీపీ భావిస్తోంది. ఇప్పటికే విశాఖలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో తిరుపతి సభనూ అదే స్దాయిలో విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ గర్జనకు రాయలసీమ నేతలు, మంత్రులు హాజరైనట్లే తిరుపతి సభకూ ఉత్తరాంధ్ర నేతల్ని తరలిచేందుకు ప్రయత్నిస్తోంది. తిరుపతి సభ తర్వాత వచ్చేనెల మొదటివారం నుంచి రాయలసీమలో వైస్సార్సీపీ కార్యక్రమాల్ని ముమ్మరం చేయాలని నిర్ణయించింది. మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమలోనూ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించబోతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర తరహాలోనే రాయలసీమలోనూ నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయాలని వైస్సార్సీపీ భావిస్తోంది.