రండి నన్నూ అరెస్ట్ చేయండి: సీఎం మమతా బెనర్జీ

సీబీఐ కార్యాలయం వద్ద నిరసన

CM Mamata Banerjee
CM Mamata Banerjee

Kolkata: ‘ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేశారు. ఏ విధమైన పద్ధతీ అవలంబించలేదు. సీబీఐ అధికారులు తనను కూడా ఆరెస్ట్ చేయాలి’’ అంటూ బెంగాల్ సీఎం మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. నారద అవినీతి కేసులో టీఎంసీకి చెందిన ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్ట్ చేయడంపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీతో పాటు తృణమూల్ కార్యకర్తలు సీబీఐ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మంత్రి ఫిర్హద్ హకీంతో పాటు సుబ్రతా ముఖర్జీని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/