యువకుడిని కత్తితో పొడిచిన స్నేహితుడు

Knife Attack on His Friend
Knife Attack on His Friend

హైదరాబాద్‌: మేడ్చల్‌లో ఓ యువకుడిపై తన స్నేహితుడే కత్తి దాడి చేశాడు. ఫోన్‌ చేసి పిలిపించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ కు చెందిన కైత శంకర్‌ తన స్నేహితుడైన మేడ్చల్‌ పట్టణ పరిధిలోని వెంకట్రామ్‌ రెడ్డి కాలనీకి చెందిన దిలీప్‌(26)కు ఫోన్‌ చేసి కలవాలని, తన వద్దకు రమ్మని పలిలిచాడు. దీంతో దిలీప్‌ శంకర్‌ వద్దకు వెళ్లగా ఇద్దరూ కలిసి బైక్‌పై మేడ్చల్‌ చెక్‌పోస్టు సమీపంలోని ఓ వెంచర్‌ వద్దకు వెళ్లారు. అదే సమయంలో శంకర్‌ తన స్నేహితుడైన దిలీప్‌ను వెనుక నుంచి కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో దిలీప్‌ అనే వ్యక్తికి తల, వీపు భాగంలో తీవ్ర గాయలయ్యాయి. అయితే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి దిలీప్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు దిలీప్‌ను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. దిలీప్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. అయితే ఈ ఘటనకు పాత కక్షలే కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/