ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ నాదే బాధ్యత

ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ బిజెపి చీఫ్ మనోజ్

Manoj-Tiwari
Manoj-Tiwari

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఈనేపథ్యంలో ఢిల్లీ బిజెపి చీఫ్‌ మనోజ్‌ తివారీ ఈ విషయంపై స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపి మధ్య ఫలితాల్లో తేడాలు కనపడుతున్నాయని అన్నారు. తమ కంటే ఆప్ కొన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, పూర్తి ఫలితాలు వెలువడడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. విజయంపై తమకు ఇప్పటికీ నమ్మకం ఉందని మనోజ్ తివారీ అన్నారు. అయితే, ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ, ఢిల్లీ బిజెపి చీఫ్‌గా ఆ పార్టీ ఓటమి లేక గెలుపునకు తనదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. కాగా, ఎన్నికల ఫలితాల్లో ఆప్ 52, బిజెపి 17, కాంగ్రెస్ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/