నేడు రంగనాయక సాగర్‌ ప్రారంభోత్సవం

ఈరోజు ఒక పంపుద్వారా రంగనాయక సాగర్‌కు నీరు

Ranganayaka Sagar
Ranganayaka Sagar

సిద్ధిపేట: నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించి నిల్వ చేసే రంగనాయక సాగర్‌ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3300 కోట్లను వెచ్చించింది. కాళేశ్వరం నుంచి సుమారు 220 కిలో మీటర్లు ప్రయాణం చేసి సాగునీరు రంగనాయక సాగర్‌కు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. మొత్తం మూడు టిఎంసిల సామర్ధంతో నిర్మాణమైన ఈ ప్రాజెకులో ఎప్పుడు 1.5 టిఎంసిల నీరు నిలువ ఉంటాయి. ఈ రిజర్వాయర్‌తో మొత్తం 1.10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను చిన్నకోడూరు మం డలంలోని చంద్లాపూర్ జ పెద్దకోడూరు శివారులో 3 టిఎంసిల సామర్థ్యంతో 8.6 కి.మీ బండ్‌ను నిర్మాణం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/