చిత్రసీమలో విషాదం : ఎన్టీఆర్ నిర్మాత కన్నుమూత

చిత్రసీమలో విషాదం : ఎన్టీఆర్ నిర్మాత కన్నుమూత

బిజినెస్ మాన్ , ఆంధ్రావాలా , డమరుకం , లవ్లీ తదితర చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న ఆర్ఆర్ వెంకట్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆర్ఆర్ మూవీ మేకర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను మొదలుపెట్టిన వెంకట్ 2012లో హాలీవుడ్‌లోకీ ప్రవేశించారు. జొనాథన్ బెన్నెట్ కథానాయకుడిగా ‘డివోర్స్ ఇన్విటేషన్’ అనే సినిమాను నిర్మించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఆహ్వానం’ సినిమాకు ఇది రీమేక్. అలాగే హిందీలో ‘ఏక్ హసీనా థీ’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అవార్డు కూడా అందుకున్నారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ ఫై దాదాపు 14 సినిమాలు నిర్మించడం జరిగింది. ఇక వెంకట్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేసారు.