ఇంకో సారి ఇలా చేస్తే పార్టీ నుంచి సాగనంపుతా : కెసిఆర్

మందు తాగిస్తూ చిందులు వేసిన ఎమ్మెల్యేపై సీఎం కేసీఆర్ సీరియస్

kcr-gives-strong-warning-to-mla-shankar-nayak

హైదరాబాద్ : మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హోలీ పండుగ రోజు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తన అనుచరులకు మందు నోట్లో పోస్తూ, డ్యాన్సులు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యేపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో, శంకర్ నాయక్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఇప్పటికే మీపై చాలా ఫిర్యాదులు వచ్చాయని మండిపడ్డారు. పార్టీ పరువు తీసే పనులు చేసేటట్టయితే… పార్టీ నుంచి వెళ్లి పోవాలని స్పష్టం చేశారు. ఇలా చేయడం క్షమించరాని నేరమని… మరోసారి ఇది రిపీట్ అయితే పార్టీ నుంచి సాగనంపుతానని హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/