దమ్ముంటే నా పై పోటీ చేయాలని ఒవైసీలకు రాజాసింగ్ సవాల్

గోషామహల్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదని ప్రశ్న

raja-singh-challenge-to-owaisi

హైదరాబాద్‌ః గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిజెపి తొలి జాబితాలోనే టికెట్ ఖరారైన సంగతి తెలిసిందే. ఆయనపై ఉన్న నిషేధాన్ని చివరి క్షణంలో ఎత్తేసిన బిజెపి హైకమాండ్ మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని రాజాసింగ్ ముమ్మరం చేశారు. ఈరోజు గోషామహల్ లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒవైసీ సోదరులపై ఆయన విమర్శలు గుప్పించారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎంఐఎం ఎందుకు తన అభ్యర్థిని నిలబెట్టలేదని ఆయన ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ‘నీవు పోటీ చేయకపోతే నీ తమ్ముడు అక్బరుద్దీన్ ను నిలబెట్టు’ అంటూ రాజాసింగ్ ఛాలెంజ్ చేశారు.