కాంగ్రెస్ పార్టీ కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్ బై ..?

టీ కాంగ్రెస్ పార్టీ కి మరో భారీ షాక్..భువనగిరి ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. కాసేపట్లో దీనిని అధికారిక ప్రకటన చేయనున్నారు. గత కొద్దీ నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన..బిజెపి లో చేరబోతారని గట్టిగా వార్తలు వినిపించాయి. కానీ కొత్త పార్టీ పెట్టె ఆలోచలన లో ఉన్నట్లు తెలుస్తుంది. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్..బిజెపి లో చేరినప్పుడే ఈయన కూడా బిజెపి లో చేరతారని అంత అనుకున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణ ఏర్పాటు తరువాత పార్టీ పీసీసీ చీఫ్‌, ఏఐసీసీ పదవులు ఆశించారు. కానీ, ఆయనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు.

అయితే, ఎప్పటికప్పుడు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఇక ఆయన తమ్ముడుు రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడినప్పుడు కాంగ్రెస్‌ నేతలతో మరింత దూరం పెరిగింది. ఆ తరువాత పార్టీ అధిష్టానంతో మాట్లాడి కాస్త చల్లబడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకు పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. మధ్యలో పలుమార్లు మోడీ , అమిత్ షా లతో వెంకటరెడ్డి భేటీ అయ్యారు. అప్పుడు కూడా వెంకటరెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అనుకున్నారు కానీ ఆయన చేరలేదు.

మరి బిజెపి ఆఫర్లు నచ్చలేదా..లేక మారే కారణమో తెలియదు కానీ వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడడం కాంగ్రెస్ పార్టీ కి పెద్ద షాక్ అని చెప్పాలి. మరో ఏడు, ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడడం కార్యకర్తలు నిరాశకు గురి అవుతున్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 1999, 2004, 2009, 2014లలో నల్లగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. నల్గొండ స్థానం నుంచి వరసగా 3 సార్లు విజయం సాధించిన తొలి సభ్యుడూ ఇతనే. వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాలలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా పనిచేశాడు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రిపదవికి రాజీనామా చేయగా గవర్నరు 2011 అక్టోబరు 5న ఆమోదించాడు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 4500 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.