కాజల్ మైనపు బొమ్మ ఆవిష్కరణ

కుటుంబ సభ్యులతో కలిసి కాజల్ ఫొటోలు

Kajal Agarwal
Kajal Agarwal

సింగపూర్‌: హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఈరోజు సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ మైనపు విగ్రహాన్ని కాజల్ అగర్వాల్..తన చెల్లి నిషా అగర్వాల్‌తో కలిసి ఆవిష్కరించింది. ఇప్పటికే సింగపూర్ వెళ్లిన కాజల్ తన మైనపు బొమ్మ పక్కన నిలబడి ఫొటో దిగింది. మైనపు బొమ్మ ఏదో, నిజమైన కాజల్ ఎవరో గుర్తు పట్టాలంటే కష్టమే. చేతిలో మైక్‌ పట్టుకుని కాజల్ తన బొమ్మ పక్కన నిలబడింది. కాజల్ అగర్వాల్.. మిక్స్‌డ్ కలర్‌లో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి కాజల్ తన మైనపు బొమ్మతో ఫొటోలు దిగింది. ప్రస్తుతం కాజల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కాగా, ఈ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు సినీనటులు మహేశ్ బాబు, ప్రభాస్ విగ్రహాలు ఉన్నాయి. బాలీవుడ్‌ నటుల్లో అమితాబ్, హృతిక్, కాజోల్ వంటి పలువురి బొమ్మలు ఉన్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/