ప్రధాని మోడీ వైజాగ్ టూర్ రద్దు..?

PM Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన రద్దయినట్లు సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న వైజాగ్ కు పీఎం రావాల్సి ఉంది. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించగా.. పర్యటన రద్దుతో తాత్కాలికంగా నిలిపివేశారు.

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ ల్యాబ్‌ను ప్రధాని మోదీ ఈ నెల 26న ‘వర్చువల్‌’గా ప్రారంభిస్తారు. గతంలో దీనికి ఉన్న ప్రాంతీయ ఫుడ్‌ ల్యాబొరేటరీ హోదాను కేంద్రం రూ.4.5 కోట్లతో రాష్ట్ర స్థాయికి పెంచింది. అత్యాధునిక పరికరాల కోసం రూ.14 కోట్లను కేటాయించి.. ఇప్పటికే రూ.8 కోట్లను మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో పరికరాలు, యంత్రాలు సమకూరితే ఏడాదికి సుమారు 20 వేల ఆహారం, నీటి నమూనాలను పరీక్షించేందుకు వీలు ఏర్పడుతుంది. దీంతో పాటు ప్రభుత్వానికి అదనంగా ఆదాయమూ సమకూరుతుంది.

మరోవైపు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో, తిరుపతిలోని టీటీడీ భవనంలోనూ రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.18 కోట్ల చొప్పున విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.07 కోట్లతో తీసుకువచ్చిన నాలుగు ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ ల్యాబ్‌లను కూడా ప్రధాని ప్రారంబిస్తారని అంత భావించారు. మరి మోడీ పర్యటన రద్దు ఫై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.