భారత్‌లో ఒక్కరోజుల్లో 9వేల కరోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 2,16,919

coronavirus-India
coronavirus-India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల రోజురోజుకు రికార్టు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 9,304 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 260 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,16,919 కి చేరగా, మృతుల సంఖ్య 6,075 కి చేరుకుంది. 1,06,737 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,107 మంది కోలుకున్నారు. ఈమేరకు ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 2587 మంది, గుజ‌రాత్‌లో 1122 మంది క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/