‘బాయ్‌కాట్ లైగ‌ర్’ ఫై విజయ్ దేవరకొండ ఘాటైన సమాధానం

‘బాయ్‌కాట్ లైగ‌ర్’ ఫై విజయ్ దేవరకొండ ఘాటైన సమాధానం ఇచ్చాడు. బాలీవుడ్ లో ప్రస్తుతం బాయ్‌కాట్‌ అనే ట్యాగ్ వైరల్ గా మారింది. ఇప్పటికే పలు సినిమాలను ఈ ట్యాగ్ తో బాయ్‌కాట్‌ చేసి ఆయా చిత్ర నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకురాగా..తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ కు కూడా తగిలింది. విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న పాన్‌ ఇండియా మూవీగా విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో లైగర్‌కు బాయ్‌కాట్‌ సెగ తగిలింది. దీనికి కరణ్‌జోహార్‌ ఒక కారణమైతే, విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌ మరో కారణంగా తెలుస్తుంది. పూరి కనెక్ట్స్‌తో కలిసి కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మించడంతో లైగర్‌ బాయ్‌కట్‌ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇక మరోవైపు ఓ ఇంటర్వ్యూలో లాల్‌సింగ్‌ చడ్డా బాయ్‌కాట్‌ చేయడంపై విజయ్‌ స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల చాలామంది కార్మికులు నష్టపోతారని కామెంట్స్‌ చేసి అమీర్‌ఖాన్‌కు మద్దతు తెలపడంతో ట్రోలింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. దీనికి తోడు ఓ ప్రెస్‌మీట్‌లో‌ విజయ్‌ దేవరకొండ టేబుల్ మీద కాళ్లు పెట్టి మీడియాకు ఆన్సర్‌ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణాలతో లైగర్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottLigerఅనే ‍హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ ఘాటు గా స్పందించారు.

‘‘‘లైగర్’ సినిమాను మూడేళ్ల ముందుగానే ప్రారంభించాం. ఆ స‌మ‌యంలో బాయ్‌కాట్ వంటి గొడ‌వ‌లు లేవు. బాహుబ‌లి సినిమాను బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యేలా చేసింది క‌ర‌ణ్ జోహార్‌గారు. నార్త్‌లో మ‌న‌కు ఆయ‌న దారి చూపించారు. ఇప్పుడు ‘లైగర్’ సినిమాను కూడా తీసుకెళ్లాలంటే క‌ర‌ణ్ జోహార్‌ కంటే మించిన వారు లేరు. ‘లైగర్’ సినిమా మ‌న‌ది. హిందీలో విడుద‌ల చేయ‌మ‌ని మ‌నం అడిగితే ఆ బాధ్య‌త‌ను ఆయ‌న తీసుకున్నారు. అస‌లు బాలీవుడ్‌లో ఏ గొడ‌వ జ‌రిగిందో తెలియ‌దు. మూడేళ్ల క‌ష్ట‌ప‌డి తీసిన సినిమాను రిలీజ్ చేసుకోకూడ‌దా.. ఇంట్లోనే కూర్చోవాలా! అని విజయ్ ప్రశ్నించారు.

లైగ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం వెళ్లిన‌ప్పుడు దేశ‌మంతటా ఉండే ప్ర‌జ‌లు అంద‌రూ ఆద‌రించారు. అలాంటి వాళ్ల కోస‌మే మేం సినిమా చేశాం. మ‌న ధ‌ర్మాన్ని మ‌నం పాటించిన‌ప్పుడు మ‌నం ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. ఎవ‌రి మాటా వినాల్సిన ప‌ని లేదు. ఎలాంటి స‌మ‌స్య వచ్చినా కొట్లాడ‌ట‌మే. దేశం కోసం, ప్ర‌జ‌ల కోసం ఏదైనా చేయ‌డానికి సిద్ధం. కంప్యూట‌ర్ ముందు కూర్చుని ట్వీట్స్ కొట్టే బ్యాచ్ మ‌న‌ది కాదు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ముందు అడుగు వేసేది మ‌న‌మే. క‌రోనా స‌మ‌యంలో నేను స్టార్ట్ చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ కోసం చాలా మంది ముందుకు వ‌చ్చి విరాళాలు ఇచ్చారు. పైకి వెళ్తుంటే కాళ్లు కింద‌కు లాగే వాళ్లు మ‌న‌కు వ‌ద్దు. ఇలాంటి విష‌యాల గురించి ఏమ‌నాలో తెలియ‌టం లేదు’’ అని కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు విజయ్ దేవరకొండ.