పిఠాపురంలో 8 రౌండ్స్ పూర్తి..50 వేల మెజార్టీ తో పవన్

ఏపీ ఎన్నికల్లో కూటమి సునామి సృష్టిస్తుంది. ప్రతి జిల్లాలో జోరు చూపిస్తున్నారు. కూటమి పార్టీల అధినేతలు కాదు కింది స్థాయి అభ్యర్థులు సైతం భారీ మెజార్టీ తో విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఇక దేశం మొత్తం ఎదురుచూస్తున్న పిఠాపురం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రస్తుతం 8 రౌండ్స్ పూర్తి కాగా దాదాపు 50 వేల మెజార్టీ తో పవన్ కళ్యాణ్ ముందంజ లో ఉన్నారు. 160 స్థానాలలో గెలుపు దిశగా కూటమి ఉంది.