కాసేపట్లో సీఎం జగన్ రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. దీంతో సీఎం జగన్ కాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ జస్టిస్ నజీరు తన రాజీనామా లేఖను పంపనున్నారు. వైసీపీకి ఈ సారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేకుండా పోయే అవకాశం కనిపిస్తోంది.

రెండో సారి అధికారంలోకి రావాలనుకున్న జగన్..అన్ని ప్రయత్నాలు చేశారు.కానీ… పాలన గురించి పట్టించుకోకుండా పూర్తిగా బటన్లు నొక్కి అప్పులు చేసి పంచడం మీదే్ దృష్టి కేంద్రీకరించడంతో ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఈ ఫలితం వైసీపీ పెద్దలందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇటు కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టిడిపి , జనసేన ఆఫీస్ ల వద్ద పెద్ద ఎత్తున బాణా సంచా కాలుస్తూ సంబరాలు జరుపుతున్నారు. ఇక వైసీపీ ఆఫీస్ వెలవెల బోతుంది.