టీడీపీ ఖాతాలో తొలి విజయం..గోరంట్ల ఆధిక్యం

gorantla buchaiah chowdary
gorantla buchaiah chowdary

అమరావతిః ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో తొలి విజయం ఖరారైంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళుతున్నారు.

రాజమండ్రి అసెంబ్లీ స్థానంలో ఇప్పటికే 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 61,564 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాగా వెనుకంజలో ఉన్నారు.

18 రౌండ్ల వరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 1,21,666 ఓట్లు రాగా, మంత్రి చెల్లుబోయినకు 60,102 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాజమండ్రి రూరల్ నియోజవకర్గంలో మరో 2 రౌండ్ల ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో, టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం ఖాయమైనట్టే.