దేశంలో కొత్తగా 795 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,054

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 795 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 58 మంది మృతి చెందారు. అంతకు ముందు రోజు మృతుల సంఖ్య 13గా ఉండటం గమనార్హం. ఇక ప్రస్తుతం దేశంలో 12,054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.03 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.17 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,24,96,369 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 79.15 కోట్ల కోవిడ్ టెస్టులను నిర్వహించారు. 184.87 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/