భారత్‌లో కొత్తగా 70,496 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,06,152..మొత్తం మృతుల సంఖ్య 1,06,490

india – corona virus

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 70,496 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,06,161కి చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 964 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,06,490 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 59,06,069 మంది కోలుకున్నారు. 8,93,592 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్న ఒక్కరోజులోనే 11.6 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/