కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌

ఓటేసిన శాస‌నస‌భ‌ స్పీక‌ర్ పోచారం

nizamabad-mlc-by-election-speaker-pocharam-participated-in-polling

నిజామాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలీంగ్‌ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది.శాస‌నస‌భ‌ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి త‌న‌ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న 42వ‌ పోలింగ్ కేంద్రంలో స్పీక‌ర్ ఓటు వేశారు. ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతున్న ఈ ఉపఎన్నిక‌లో ముగ్గురు అభ్య‌ర్థులు పోటీప‌డుతున్నారు. మొత్తం 824 మంది స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు ఓటువేయ‌నున్నారు. ఉపఎన్నిక‌ ఫ‌లితాలు ఈనెల 12న వెలువ‌డ‌నున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/