దిగొస్తున్న టమాటా కేజీ రూ.50

గత రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాటా..నెమ్మదిగా దిగొస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ టమాటా రూ. 60 , 50 మధ్య లో ఉంది. మరోవారం లో కేజీ టమాటా రూ. 20 చేరినఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు మార్కెట్ వర్గాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలలుగా టమాటా ధర కొండెక్కి కూర్చుంది. కేజీ టమాటా రూ. 200 నుండి రూ. 250 పలికింది. దీంతో సామాన్య ప్రజలు టమాటా వైపు చూసేందుకు భయపడ్డారు.


మరికొంతమంది మాత్రం కేజీ తీసుకునే దగ్గర పావుకేజీ తీసుకుని వెళ్లారు. పలు రాష్ట్రాల్లో సబ్సిడీ రూపంలో టమాటా ను ఆయా ప్రభుత్వాలు ప్రజలకు అందించడం జరిగింది. రెండు రోజులుగా టమాటా ధర తగ్గడం మొదలుపెట్టింది. హైదరాబాద్ రైతు బజార్లలో కిలో టమాటా రూ. 50-60 మధ్య పలుకుతోంది. బయట మార్కెట్లో మాత్రం రూ. 60-80 మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతరంపురంతోపాటు కర్ణాటక నుంచి కూడా హైదరాబాద్‌కు టమాటాలు వస్తున్నాయి. దీనికితోడు రంగారెడ్డి, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటాలు పోతెత్తడంతో ధర తగ్గుముఖం పట్టింది. మరో వారం రోజుల్లో కేజీ టమాటా. 30 , 40 వరకు రావొచ్చని అంటున్నారు.