కేరళలో ఒకే రోజు ఐదుగురికి కరోనా పాజిటివ్‌

5 Coronavirus positive cases in Kerala
5 Coronavirus positive cases in Kerala

కేరళ: భారత్‌లో తాజా మరో ఐదు కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కేసులు నమోదయ్యాయి. కేరళలో పథనంతిట్ట జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 39కి చేరింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ… ‘మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తేలింది. వారికి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చారు. పథనంతిట్ట జిల్లాలోని తమ ఇంటికి చేరుకున్నాక వారి ఇంట్లోని మరో ఇద్దరికి సోకింది’ అని ఆమె ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/