మహిళా దినోత్సవం కవిత

మహిళ

Women’s Day

ఆడదంటే
దుర్మార్గులను
ఎదిరించే శక్తి స్వరూపిణి అన్యాయాన్ని ఎదిరించే
ఆది శక్తి
తన లక్ష్యం నెరవేర్చుకొనే
చేతన్య దీప్తి
కష్టాలను కూడా ఇష్టాలుగా
స్వీకరించే సహన మూర్తి
ప్రేమానురాగాలు పంచి పెట్టె
కరుణామహి
తన శక్తి సామర్ధ్యాలతో
ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది
మహిళగా లోకాన్ని మేలుకొలిపే ధీరురాలు
ఆడదంటే అబల కాదు సబల అని
తన కీర్తిని దేశ దేశాలకు
చాటుకొనే వీర వనిత
నిరంతరం శ్రమిస్తూ
కుటుంబ భారాన్ని మోసే యంత్రం
ఆడదంటే
అమ్మా అని పిలిపించుకొనే మాతృమూర్తి
ఆడదంటేనే
అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం
ఆడదంటేనే
మరియొకరికి జన్మనిచ్చే దేవత
పూజించబడే లక్ష్మి
ఆరాధించే దైవం
ఎక్కడైతే
స్త్రీని గౌరవిస్తారో
అక్కడ ప్రతిరోజు
అంతర్జాతీయ మహిళా దినోత్సవమే

  • అనిత దావత్‌

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/