మహిళల టీ20: టాస్‌ గెలిచి బ్యాట్‌ పట్టిన ఆస్ట్రేలియా

Women's T20 World Cup final
Women’s T20 World Cup final

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ దిగింది. అంతిమ పోరులో ఆస్ట్రేలియా భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టు నుంచి కానీ, ఆస్ట్రేలియా జట్టు నుంచి కానీ ఏ విధమైన మార్పులు చేయలేదు. సెమీస్‌లో ఆడిన జట్టుతోనే ఆసీస్ బరిలోకి దిగుతుండగా.. గ్రూప్‌ దశలో విన్నింగ్ కాంబినేషన్‌ను భారత్ కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, టాస్ నెగ్గితే తాను కూడా బ్యాటింగ్‌ కే మొగ్గు చూపేదాన్ని అని హర్మన్‌ తెలిపింది. కాగా టాస్ అనంతరం మెల్‌ బోర్న్ క్రికెట్ స్టేడియంలో అమెరికా పాప్ సింగర్‌‌ కేటీ పెర్రీ ఇచ్చిన లైవ్‌ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. అలాగే, భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసింది. ఈ టోర్నీలో భారత్ మొదటి ఫైనల్ ఆడుతుండగా… ఆస్ట్రేలియా ఆరోసారి ఫైనల్ బరిలో నిలిచింది. భారత మహిళల జట్టు ఇప్పటిదాకా ఒక్క వరల్డ్ కప్ కూడా నెగ్గలేదు. ఈసారి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/