ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు హతం

ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు హతం
encounter

భువనేశ్వర్‌: ఒడిశాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్‌ జిల్లా సకేళి అడవిలో గురువారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. సాయంత్రం సమయంలో పోలీసులకు, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/