గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారా..?

గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి అంటే తెలియని వారు లేరు. మైనింగ్ రారాజు గా గాలి జనార్దన్ రెడ్డి ని పిలుస్తారు. మైనింగ్ లో కొన్ని వందల కోట్లను సంపాదించాడు. అంతే కాదు అక్రమ మైనింగ్ కేసులో రెండేళ్ల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపాడు. ప్రస్తుతం జైలు నుండి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి..తన వ్యాపారాలను చేసుకుంటూ గడిపేస్తున్నాడు. అయితే బిజెపి నేతగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి..త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీ ప్రారంభించేందుకు జనార్దన్ రెడ్డి సిద్ధమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి గాను త్వరలోనే ఈసీ ని కలిసి, దీనిపై కార్యాచరణ ప్రకటించబోతున్నారని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కి ఉన్న పలుకుబడి , డబ్బు తో కర్ణాటకలో దాదాపు 20 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలడని ఆయన శ్రేణులు అంటున్నారు. నిజంగా గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారా..లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.