టెస్టు జట్టు నుంచి రాహుల్ ఔట్!
న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు భారత్ జట్టు ఎంపిక

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. అయితే ఇందులో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు చోటు దక్కకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకోవాలన్న అతడికి నిరాశే మిగిలింది. మరోవైపు రంజీలో గాయపడిన ఇషాంత్ శర్మకు కూడా జట్టులో అవకాశం లభించింది. అంతేకాకుండా యువపేసర్ నవదీప్ సైని, యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్, పృథ్వీషాకు కూడా జట్టులో చోటు దక్కింది. చివరి టీ20లో గాయపడిన ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో వన్డే సిరీస్‌కు మయాంక్ అగర్వాల్‌కు అవకాశం ఇచ్చారు. భారత టెస్టు జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, నవదీప్ సైని, శుభ్‌మన్ గిల్, అజింక్య రహానే, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/