‘స్కూలు వయసు’లో ప్రమాణాల లోపం

భారతదేశంలో చాలా మంది చిన్నారులను నాలుగు సంవత్సరాలలోపే పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో నాలుగు సంవత్సరాల వయసులోపే పిల్లలను ప్లే స్కూళ్లకు పంపుతున్నారు. నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి అంటూ స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు.

Students n classRoom

ఎందుకంటే పిల్లలకు స్కూల్‌ అలవాటు కావాలని, ముందునుంచే స్కూల్లో వేస్తే ఐదు సంవత్సరాల వయస్సువచ్చేసరికి నేరుగా ఒకటవ తరగతిలో చేర్పించవచ్చులే అని తల్లిదండ్రులు తమ పిల్లలను అతి తొందరగా పాఠశాలలకు పంపిస్తున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. నిజానికి విద్యా హక్కుచట్టం 2009 ఏమి చెబుతుందంటే పిల్లలను ఆరు సంవ త్సరాల వయస్సుకంటే ముందుగా ఒకటవ తరగతిలోకి ప్రవే శించడానికి వీలులేదని ఆదేశించింది.

అదేవిధంగా మూడు సంవ త్సరాలు నిండిన బాలలను ప్రాథమిక విద్యకు సంసిసిద్ధులను చేయడానికి ఆరేళ్లు నిండేవరకు శైశవ దశ సంరక్షణ, విద్యను అందించేందుకు ఉచిత పూర్వ పాఠశాల ఏర్పాట్లు ప్రభుత్వాలు చూడాలని ఉంది. అందులో భాగంగానే అంగన్‌ వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత కాలంలో భారతీయ తల్లి దండ్రులు మాత్రం తమ పిల్లలను నాలుగుసంవత్సరాల వయస్సు లోనే ఒకటవ తరగతిలో చేర్పిస్తున్నారు.

భారతదేశంలో తల్లిదం డ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రిస్కూల్‌ విద్యను ప్రైవేట్‌ కార్పొరేట్‌ శక్తులు అందిపుచ్చుకుని, చైన్‌స్కూళ్లను ఏర్పాటు చేసి వేల కోట్లను ఆర్జిస్తున్నాయి. ప్రిస్కూల్‌ మూడు దశలుగా విభ జించబడింది. ప్లేగ్రూప్‌, జూనియర్‌ కిండర్‌ గార్డెన్‌ లేదా లోవర్‌ కిండర్‌ గార్డెన్‌, సీనియర్‌ కిండర్‌ గార్డెన్‌ లేదా అప్పర్‌ కిండర్‌ గార్డెన్‌. ఒక ప్లేగ్రూప్‌ క్లాసులలో ఒకటిన్నర నుండి రెండున్నర సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలను చేర్పిస్తున్నారు.

జూని యర్‌ కిండర్‌ గార్డెన్‌ తరగతిలో మూడున్నర నుండి నాలుగున్నర సంవత్సరాల వయస్సు పిల్లలను చేర్పిస్తున్నారు. సీనియర్‌ కిండర్‌ గార్డెన్‌ తరగతిలో నాలుగున్నర నుండి ఐదున్నర సంవత్సరాల వయస్సు పిల్లలను చేర్పిస్తున్నారు. కిండర్‌ గార్డన్‌లో చిన్న పిల్లలు వస్తువ్ఞలతో ఆడుకుంటూ నేర్చుకుంటారు.

అలాగే కిండర్‌ గార్డెన్‌ ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే పిల్లల్లో మంచి శరీరాకృతి, సరిపడినంత కండర సమన్వయం, మౌలిక కదలిక లను పెంపొందించడం.మంచి ఆరోగ్య అలవాట్లను అలవరుచుకో వడానికి స్వయంగా దుస్తులు ధరించడం, మూత్రశాలకు వెళ్లడం, ఆహార అలవాట్ల వంటి వ్యక్తిగత సర్దుబాట్లకు అవసరమైన మౌలిక నైపుణ్యాలను వృద్ధి చేయడం.భావ వ్యక్తీకరణ, అర్థంచేసుకోవడం, అంగీకరించడం, తన భావాలను, ఉద్వేగాలను అదుపు చేసుకోవ డంలో పిల్లలకు మార్గదర్శకత్వం చేయడం ద్వారా భావ పరిణితిని పెంపొందించడం, అభిలషణీయమైన మంచి సాంఘిక వైఖరు లను, అలవాట్లను పెంపొందించడం, ఆరోగ్యకరమైన సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, కళాత్మక దృష్టిని ప్రోత్సహిం చడం,చిత్రలేఖనం, సంగీతం మొదలైనవి. తన చుట్టుపక్కల ఉన్న వాతావరణం పిల్లవానిలో వివేచనాత్మక ఉత్సుకతల ప్రారంభాన్ని ప్రేరేపించడం, తగినన్ని అవకాశాలు అందించడం ద్వారా పిల్లల స్వతంత్రాన్ని, సృజనాత్మకతను ప్రోత్సహించడం చేయాలి.

కానీ నేడు కిండర్‌ గార్డెన్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు భాషల్లో అక్షరాలు, పదాలు నేర్పించడం, గణితంలో ప్రాథమిక పరిజ్ఞానా న్ని అందించడానికి బట్టీ పద్ధతులు ఉపయోగిస్తున్నారు. విద్యార్థి అభివృద్ధికి పాఠశాల ఒక అవకాశం కల్పించాలి.

స్వేచ్ఛగా వృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరికీ పాఠశాల విద్య దోహదపడాలి. కానీ ప్రీ స్కూల్‌ నుంచే పిల్లలు ఒత్తిడికి గురవ్ఞతున్నారు. భారతదేశంలో అధికభాగం ప్రీ స్కూల్‌ ప్రైవేటు, కార్పొరేట్‌ల ఆధ్వర్యంలో నడ పబడుతున్నాయి. ఇది కిండర్‌ గార్డెన్‌లో ఒక భాగంగానడుస్తుంది. సీనియర్‌ కిండర్‌ గార్డెన్‌ పూర్తి చేసిన తర్వాత పిల్లలు ప్రాథమిక పాఠశాల ఒకటవ తరగతి లేదా మొదటి స్టాండర్డ్‌లోకి ప్రవేశి స్తారు.కిండర్‌ గార్డెన్‌ ఎక్కువగా సాధారణ పాఠశాలల అంతర్భా గం. అయినప్పటికీ కొన్నిసార్లు అవి స్వతంత్ర సంస్థలుగా ఉంటు న్నాయి.ఎక్కువగా పెద్ద సంస్థలలో భాగాలుగా ఉంటున్నాయి. నెమ్మదిగా పిల్లలు స్కూళ్లకు అలవాటు అవ్ఞతారు అని పంపిస్తు న్నామని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ పద్ధతి ఒకప్పుడు పట్టణాలు, నగరాలకు పరిమితమయింది.

కానీ నేడుమారుమూల గ్రామాల్లో సైతం కిండర్‌ గార్డెన్‌ వ్యవస్థ స్కూళ్లలో నడుస్తోంది. వార్షిక విద్యాస్థితిగతుల నివేదిక (ఎ.ఎస్‌.ఇ.ఆర్‌) 2019 నివేదిక ప్రకారం ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో ఐదవ వంతు కంటే ఎక్కువ మంది ఒకటవ తరగతి చదువ్ఞతున్నారు. అతి తక్కువ వయస్సులోనే ఒకటవ తరగతిలో చేరడం ద్వారా వారికంటే పెద్ద పిల్లలే గణనీ యంగా మెరుగ్గా చదువ్ఞల్లో రాణిస్తున్నారని నివేదిక సూచిస్తోంది. అక్షరాలతోపాటు సంఖ్యలను గుర్తించగలగడం, అలాగే చదవగల సామర్థ్యం ఎక్కువగా పెద్ద పిల్లల్లోనే ఉంటుందని తెలిపింది. పిల్ల లను చాలా చిన్నవయస్సులోనే అధికారికపాఠశాలల్లో చేర్పించడం కారణంగా వారి స్కూల్‌ లైఫ్‌ విద్యాపరంగా ఇతరుల వెనుక ఉండ టానికి ఒక ముఖ్యమైన కారణం అని నివేదిక పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగాచూస్తే యూకెలోని పిల్లలకు కనీసం ఐదు సంవత్సరాల వయస్సులోపు ఉండాలి. అదే యూఎస్‌లో అయితే ఆరుసంవత్స రాల వయస్సులోపు ఉంటే తప్ప అధికారిక పాఠశాల విద్యను ప్రారంభించరు.వాస్తవానికి కిండర్‌ గార్డెన్‌లో పిల్లల చదువ్ఞ ప్రారం భం కావాలన్నా ఒక పిల్లవాడు కిండర్‌ గార్డెన్‌లో చేరేముందు యుకే లేదా యుఎస్‌లో వరుసగా ఐదు లేదా ఆరు సంవత్సరాల వయస్సు తప్పనిసరిగా ఉండి తీరాలి.

స్టాన్ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం ఐదు లేదా ఆరు ఏళ్ల వయస్సులో పిల్లలను పాఠశాలలో చేర్చుకోవడం ద్వారావారి విద్యావిజయాలను మెరుగు పర్చడమే కాక నేరాలకు పాల్పడే వారి ప్రవృత్తిని కూడా తగ్గిస్తుం దని గుర్తించారు. పిల్లల పాఠశాల ప్రారంభం వయస్సు ప్రమా ణాల ప్రతికూలతలను సూచిస్తోంది. అతి తక్కువ వయస్సులోనే పిల్లలను స్కూళ్లకుపంపితే పిల్లలమానసిక స్థితిపై కూడా ప్రభావం పడే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • ఆత్మకూరు భారతి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/