చాంపియన్‌షిప్‌లో భారత్‌-పాక్‌ తలపడాలి

లేకుంటే చాంపియన్‌షిప్‌కు అర్ధమే లేదు: వకార్‌ యూనిస్‌



ముంబయి: భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తుంటాయి, అలాంటిది 2007 నుంచి ఇప్పటివరకు కూడా ఇరు దేశాల మధ్య ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌ కూడా జరగలేదని, పాక్‌ మాజీ కెప్టెన్‌ వకార్‌ యునిస్‌ అన్నారు. భారత్‌, పాక్‌ల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తనకు తెలుసని.. ఐసీసీ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సూచించాడు. ఇరు దేశాలు టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌లో తలపడాలని లేకుంటే చాంపియన్‌షిప్‌కు విలువ ఉండదని వకార్‌ అన్నారు. తాను కూడా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ద్వారానే టెస్ట్‌ అరంగేట్రం చేశానని తెలిపాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/