భారత్ లో 40 మంది ‘ఒమిక్రాన్’ అనుమానితులు..!

మహారాష్ట్రలో 28, ఢిల్లీలో 12 ఒమిక్రాన్ అనుమానిత కేసులు..ఆసుపత్రుల్లో చికిత్స

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. మరో 40 ‘అనుమానిత’ కేసులను అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా మహారాష్ట్రలో 28, ఢిల్లీలో 12 అనుమానిత కేసులను గుర్తించారు. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. వారిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స చేస్తున్నారు. మహారాష్ట్రలో గుర్తించిన అనుమానిత కేసుల్లో 10 మంది ముంబైకి చెందిన వారేనని అధికారులు చెప్పారు.

నిన్న ఒక్కరోజే విదేశాల నుంచి 861 మంది ప్రయాణికులు వచ్చారని, వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామని, 28 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అందులో 25 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులు కాగా, మరో ముగ్గురు వారి కాంటాక్ట్ లన్నారు. ఇటు ఢిల్లీలోనూ మరో 12 అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. నిన్న 8 మంది అనుమానితులను ఆసుపత్రిలో చేర్చగా.. ఇవాళ మరో నలుగురిని తరలించామని అధికారులు చెబుతున్నారు.

.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/