ఫిలిప్పీన్స్‌లో కూలిన వైమానిక దళ విమానం

17 మంది మృతి

Air Force plane crashes in the Philippines
Air Force plane crashes in the Philippines

ఫిలిప్పీన్స్‌లో వైమానిక దళానికి చెందిన విమానం కుప్పకూలింది. 85 మంది సైనికులు సహా 92 మందితో వెళ్తున్న సి-130 విమానం ల్యాండ్ అవుతున్నవేళ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ ఘటన నుంచి 45 మందిని రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నట్టు ఆర్మీ చీఫ్ సిరిలిటో సొబెజనా వెల్లడించారు. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో వ ఘటన జరిగిండు. విమానం శిథిలాల నుంచి 40 మందిని రక్షించి, వారిని ఆసుప్రతికి తరలించినట్లు దేశ రక్షణ మంత్రి తెలిపారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/