భారత్లో 24 గంటలో 3,561 కొత్త కేసులు
24 గంటలో 89 మంది మృతి..కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,783

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్లో తన పంజా విసురుతుంది. గడిచిన 24 గంటలో దేశంలో 3,561 మందికి కొత్తగా కరోనా సోకింది. గత 24 గంటల్లో భారత్లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 52,952కి చేరింది. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,783కి చేరింది. కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి 15,266 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో 35,902 మంది చికిత్స పొందుతున్నారు.ఈ మేరకుకేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/