ఏపీలో థియేటర్స్ యజమానులకు నిద్ర లేకుండా చేస్తున్న జగన్..

ఏపీలో సినిమా థియేటర్స్ యజమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. . టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 35 ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ఫై హైకోర్టు లో విచారణ జరుగుతుంది. ఇదిలా ఉంటె ప్రభుత్వం నిర్ణయంచిన ధరల కంటే ఎక్కువ ధరలకు టికెట్స్ విక్రయిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అలాగే థియేటర్స్ లలో భద్రత పట్ల కూడా చూస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు , రెవిన్యూ అధికారులు థియేటర్స్ లలో తనిఖీలు చేస్తూ..నియమాలు పాటించని థియేటర్స్ ను సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో థియేటర్స్ ను సీజ్ చేయగా..బుధువారం కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కృష్ణాజిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీలు రెగ్యులర్‌గా కొనసాగుతాయన్నారు. బెనిఫిట్ షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేస్తారన్నారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లలో తిను బండరాలు, పార్కింగ్ విషయంలో దోపిడీ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత పేర్కొన్నారు.